లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో యూరియా రాక కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని మార్కెట్ యార్డ్ కి యూరియా లారీ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి మార్కెట్ యార్డ్ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం. చుంచుపల్లి. కొత్తగూడెం మండలాల రైతులు గురువారం నుండి మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, సోమవారం యూరియా లారీ వస్తుంది, ఇస్తామని నచ్చజెప్పి అధికారులు తిప్పి పంపిస్తున్నారు. సోమవారం కూడా యూరియా లారీ రాకపోవడంతో రైతులు తీవ్ర వేదనానికి గురయ్యారు. ఇచ్చే రెండు బస్తాల యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం యూరియాను అందజేయాలని కోరుతున్నారు.