ఇల్లెందు, సెప్టెంబర్ 12 : లక్షలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే సకాలంలో యూరియా అందక భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న సొసైటీ ఎరువుల గోడౌన్ వద్దకు తెల్లవారుజామునే యూరియా కోసం వచ్చిన రైతులు ఉదయం 9 గంటల వరకు లైన్లో నిలబడ్డారు. ఇక విసుగు చెందడంతో వారి చెప్పులను తీసి లైన్ లో పెట్టి పక్కన ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశాం.
సరైన సమయంలో పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఎకరాలు సాగు చేసిన రైతుకి ఒక్క యూరియా బస్తా ఇస్తే ఏ మూలన వేయాలని, ఎక్కడ వేయాలని బాధ వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు, రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Yellandu : ‘లక్షలు ఖర్చుపెట్టి పంట సాగు చేస్తే.. యూరియా లేక నష్టం వచ్చే పరిస్థితి’