భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 09 : కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కొత్తగూడెం, పాల్వంచలో ఆయన ప్రచారం చేశారు. మాజీ మంత్రి వనమా, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రతీ వార్డులో తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ నాయకులు మూటలు పట్టుకుని వస్తున్నారు వారి మాయ మాటలు నమ్మొద్దన్నారు. పాల్వంచ ప్రచారంలో అధికార పార్టీ నాయకులు కరెంట్ తీసేశారని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర