రామవరం, జూలై 30 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో నిర్వాహకులతో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా నేర్పిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిస్తుండంపై జమాతే ఇస్లామి హింద్ సంస్థ సభ్యులకు వారు అభినందనలు తెలిపారు.
చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా చేపట్టిన మిషన్ ప్లాంటేషన్లో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ, సభ్యులు అబ్దుల్ బాసిత్, షమీం, అజ్మత్, పర్వీన్ సుల్తానా, ఇర్ఫాన్, జావిద్, సుధాకర్, టీచర్లు పాల్గొన్నారు.
Ramavaram : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి : సీఐ ప్రతాప్