లక్ష్మీదేవిపల్లి, మే 19 : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం రాముల వారి దర్శన కోసం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలోని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు సంగం శివ గృహంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కన్వీనర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలను నాటడం ఒక యజ్ఞంలాగా చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం, పర్యావరణంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు భద్రం శ్రీరామ్, నిరంజన్, రవి, నరేశ్, ప్రవీణ్, వంశీ, తరుణ్ పాల్గొన్నారు.
LakshmiDevipalli : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత : చెప్యాల రాజేశ్వర్రావు