ట్రాన్స్ఫార్మర్ల వద్ద హెచ్చుతగ్గులు.. లోడ్ బ్యాలెన్స్‌పై విద్యుత్ శాఖ చర్యలు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్‌కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుతగ్గులు. లోడ్ బ్యాలెన్స్ పై చర్యలు చేపట్టారు..
బూర్గంపహాడ్, మే 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్‌కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుతగ్గులు. లోడ్ బ్యాలెన్స్ పై చర్యలు చేపట్టారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో పాటు వినియోగదారులు ఏసీ, కూలర్లు ఎక్కువ సామర్థ్యం మేరకు వాడుతుండడంతో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హై వోల్టేజ్ కారణంగా ఫీజులు ఎగిరిపోతున్నాయని. ఈ క్రమంలో వాటిని సరిచేసేందుకు హెచ్చుతగ్గులు చేస్తూ, లోడ్ బ్యాలెన్స్ చేస్తూ సిబ్బంది, రాత్రనకా పగలనక పని చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు పోవడం జరుగుతుందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతిరోజూ ఉదయం గంట, సాయంత్రం గంటసేపు విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏడీ నర్సింహారావుతో పాటు ఏఈ ఉపేందర్ చెబుతున్నారు. దీనికి వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం ఎం.సత్యనారాయణ, లైన్మెన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

