భద్రాచలం: ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇందుకు సంబంధించిన కౌన్సిలింగ్, లాటరీ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ను ఖమ్మం రీజియన్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాస్ రాయ్ ప్రారంభించారు. వివిధ పాఠశాలల్లో ఉన్న107 సీట్లను లాటరీ ద్వారా భర్తీ చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన బాలికల ప్రిన్సిపాల్ మెండెం దేవదాసు, ఏకలవ్య మోడల్ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్, వివిధ ప్రాంతాల నుంచి 200మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.