తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలల్లో హర్యానా టీచర్లు నియామకం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల 46 పోస్టులను భర్తీ చేయగా, 43 మంది హర్యానాకు చెందిన వాళ్లే ఉండటం ఇందుకు బలం చేకూరుతున్నది.
భద్రాచలం: ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంద�