– సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా
రుద్రంపూర్, ఏప్రిల్ 09 : కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గురువారం రామవరంలోని కిన్నెరసాని, భగీరథ పనుల పైప్ లైన్లను, నూతన ట్యాంకులను పరిశీలించిరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రూ.125 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని మంజూరు చేయించి ప్రజలు మంచినీళ్లకు బాధపడొద్దని కృత నిశ్చయంతో చేసిన పనులకు అధికారుల అలసత్వం ద్వారా పనులు జాప్యం అవుతున్నాయన్నారు. తక్షణమే మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి నూతన ట్యాంక్ కి నీళ్లు ఎక్కించి రామవరంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అలాగే పాత కిన్నెరసాని ట్యాంక్ ద్వారా సాయంత్రానికి నీళ్లు అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పైప్ లైన్ జరుగుతున్న ప్రాంతాల్లో శిథిలమైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆయన ఆదేశించారు. పనులను పరిశీలించిన సిపిఐ ప్రతినిధి బృందంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాస్, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, త్రీ టౌన్ టౌన్ ఏరియా కార్యదర్శి యూసుఫ్, 14,16,17 వ డివిజన్ కార్పొరేటర్స్ సుధాకర్ రాజు, మునిగడప పద్మ, ఎర్రబెల్లి శంకర్, సీనియర్ నాయకులు మాటేటి గోపాల్, సర్పంచ్ నగేష్, రమేష్, అంకుష్ గంటాడి కోటేశ్వరరావు, ఖంపెల్లి దుర్గయ్య, నాగరాజు, శివ ,రాజు ,జగ్గు, చందు, నాగరాజు పాల్గొన్నారు.