టేకులపల్లి, ఫిబ్రవరి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు పలుగు, పార, బొచ్చలు సర్పంచ్ బోడ బాలు నాయక్ చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. టేకులపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులలో 30 గ్రూపులకు 30 గడ్డ పారలు, 60 పారలు, 90 బొచ్చలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తి, ఉప సర్పంచ్ వసంత, వార్డు సభ్యులు జీజ, సుజాత, రామకృష్ణ, కిరణ్, గణేష్, ఉషా, కోక, కోటేశ్వరరావు, బాబురావు పాల్గొన్నారు.