చుంచుపల్లి, అక్టోబర్ 09 : కొత్తగూడెం, రామాంజనేయ కాలనీ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలకు రూ.10 వేల విలువైన 15 కుర్చీలు, 50 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా ఫ్లోర్ మ్యాట్లు విద్యానగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన శ్రీ నిత్య జన్మదినం సందర్భంగా గురువారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ పాఠశాలకు సభ్యుడు సీతారామ శాస్త్రి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయ కాలనీ మాజీ సర్పంచ్ జ్ఞానమూర్తి, ప్రధానోపాధ్యాయుడు జగ్గుదాస్, టీచర్ సునీత, సభ్యులు రాజేంద్రప్రసాద్, విజయ మోహన్, మైనేని నాగేశ్వరరావు, అంజనానందం, ఎస్.రామచంద్రరావు, నసీరుల్లా, సోందుబాబు పాల్గొన్నారు.