రామవరం: సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని, జీకేవోసీ గనులను మంగళవారం మినీస్ట్రీ ఆఫ్ కోల్ డైరెక్టర్, సింగరేణి బోర్డాఫ్ డైరెక్టర్ సభ్యుడు పీఎస్ఎల్ స్వామి సందర్శించారు. ఏరియా జీఎం నరసింహారావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జీఎం కార్యాలయంలోని తన ఛాంబర్లో డైరెక్టర్‌కు ఏరియాలోని ప్రాజెక్టుల గురించి, ప్రతిపాదిత ప్రాజెక్టుల గురించి మ్యాపుల ఆధారంగా సుధీర్ఘంగా వివరించారు.
అనంతరం జీకేవోసీ ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించి బొగ్గు ఉత్పత్తిని గురించి, ఓబీ తొలగింపు, యంత్రాల పని తీరు, ప్రతిపాదిత వీకేవోసీ ప్రాజెక్టు గురించి వివరించారు. అనంతరం జీకేవోసీ మైన్‌లో సుమారు రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపార్కును సందర్శించారు. పీవీకే 5 గనిలో ఏర్పాటు చేసిన కంటిన్యూయస్ మైనర్ పనితీరు, ఉత్పత్తిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, ఎస్వోటు జీఎం నారాయణరావు, ఏరియా ఇంజనీర్ రఘురామిరెడ్డి, ఏజీఎం సివిల్ సూర్యనారాయణ, పీవోలు వెంకటరామిరెడ్డి, రమేష్, డీజీఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణారెడ్డి, ఫారెస్టు మేనేజర్ హరినారాయణ, జీకేవోసీ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ మధుకర్, అడిషనల్ మేనేజర్ దిలీప్‌కుమార్, సీనియర్ పీవోలు శ్రావణ్, హసీంపాషా తదితరులు పాల్గొన్నారు.