భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.