ఇల్లందు, జులై 4: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన నిర్వహిస్తుందని పదేపదే చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత దిండిగాల రాజేందర్ (Dindigala Rajender) అన్నారు. దీనికి నిదర్శనమే హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ సమావేశానికి బీఆర్ఎస్ యువజన నాయకులు అడ్డుపడతారనే నెపంతో ఇల్లందు పట్టణ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుల అరెస్టు చేయడమని విమర్శించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన గిన్నరపు రాజేష్, సత్తాల హరి కృష్ణ, కాసాని హరిప్రసాద్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.