ఇల్లెందు, ఏప్రిల్ 01 : ఇల్లెందు పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పనులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ గా పనిచేస్తున్న మర్రిగూడెంకు చెందిన యువకుడు కుంచ ఉదయ్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం మీదనే షాక్ కు గురవడంతో అక్కడి నుండి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది 108 వాహనంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉదయ్ భార్య, బాబు ఉన్నారు.