
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమని సీఆర్పీఎఫ్ 141 కమాండెంట్ హరి ఓం ఖరే అన్నారు. గురువారం గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ అభివృద్ధి కోసం గ్రీన్ భద్రాద్రి చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. అనంతరం గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పట్టణంలోని అన్ని కాలనీలల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని, నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్లనిచ్చే మొక్కలు నాటి, జంతువులకు, పక్షులకు ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తిరుమల రావు, ఉప్పాడ రాంప్రసాద రెడ్డి, రాసమళ్ల రాము, పూర్ణ, కడాలి నాగరాజు, పూనెం వీరభద్రం, గురుకుల పాఠశాల ఆర్సీఓ శ్రీనివాస్ రాయ్, ప్రిన్సిపాల్ దేవదాస్ పాల్గొన్నారు.