ఇల్లెందు, సెప్టెంబర్ 01 : తెలంగాణ అపర భగీరధుడు, ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్పై నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీడు భూమిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి దేశంలోనే వరి ఉత్పత్తిలో నంబర్ వన్ తెలంగాణను నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్పై తప్పుడు ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, సీనియర్ ఉద్యమ నాయకుడు సిలివేరి సత్యనారాయణ, బర్మావత్ లాల్ సింగ్, జెకె శ్రీను, కటకం పద్మావతి, కటకంచి పద్మావతి, సుజాత, తార, నెమలి ధనలక్ష్మి,కొక్కు సరిత, భాగ్య, మౌనిక, కటకంచి వీరస్వామి, చాంద్ పాషా, హరి ప్రసాద్, రాజేశ్, అఖిల్, రవికాంత్, బజార్ సత్యనారాయణ పాల్గొన్నారు.