చుంచుపల్లి, జూన్ 26 : కాంగ్రెస్ ముహూర్త పూర్వకంగా ప్రజలకు హామీలు ఇచ్చి గద్దె ఎక్కింది. అయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాకేశ్ గురువారం రుద్రంపూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలంగాణ అమరవీరుల స్మృతివనంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనతరం బీఆర్ఎస్ రుద్రంపూర్ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతు బంధు ఇచ్చాం.. పండగ చేసుకోండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అవమానిస్తున్నదన్నారు. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చి పండగ చేసుకోమంటున్నరని ఆయన ప్రశ్నించారు. పాలించలేకపోతే గద్దె దిగాలి అని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనుదీప్, గూడెల్లి యాకయ్య, మూడు జయరాం, తోగరు రాజశేఖర్, యూసుఫ్, ఉమర్, గుమ్మడి సాగర్, బాచి రెడ్డి, కన్నీ, టీచర్ ప్రదీప్, మున్ను, రవితేజ, గూడెల్లి ముఖేష్, పృథ్వీ, పవన్, అజార్, రాజేశ్, రవి, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.