చండ్రుగొండ, ఏప్రిల్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
మోసపు వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కమిటీ నాయకులు ధారా వెంకటేశ్వరరావు, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి రమేష్, సూరా వెంకటేశ్వరరావు, మేడ మోహన్రావు, సయ్యద్ యాకూబ్, సయ్యద్ బాద్ షా, అల్లాభక్ష్, ఆంగో శ్రీను, పాండ్ల అంజన్ రావు, ఓరుగంటి రాములు, శ్రావణ్, జానకి రాములు, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.