ఇల్లెందు, అక్టోబర్ 16 : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న జరిగే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలని, అందుకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ కోరారు. గురువారం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నిర్ణయం మేరకు ఈ 18 వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపు నివ్వడం జరిగిందన్నారు.
అలాగే పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, మంత్రివర్గంలో కూడా బీసీ కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ జబ్బార్, యలమందల వాసు, ఎర్రబెల్లి కృష్ణయ్య, సనా రాజేష్, లలిత్ కుమార్ పాసి, ఉపేందర్, వసంతరావు, పరికపెల్లి రవి, రామ్ లాల్ పసి, బజారు సత్యనారాయణ, డేరంగుల పోషం, పాలడుగు రాజశేఖర్, సర్దార్, ఇమ్రాన్ కిషన్ పాసి, మదార్ బీ, సత్యవతి పాల్గొన్నారు.