రామవరం, అక్టోబర్ 29 : మొంత తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జేవీఆర్, కిష్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వర్షం నీటితో ఓపెన్ కాస్టలు జలాశయాలుగా మారిపోయాయి.
అధికారులు మోటర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. బొగ్గు రవాణాకు ఆటంకం కలగకుండా యాడ్లలో నిలువచేసిన బొగ్గును రవాణా చేస్తున్నారు.
రెండు ఓసీలు కలిపి 35,000వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓవర్ బర్డెన్ తొలగింపులో
రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు ఆగిపోయాయి. జేవిఆర్ఓసీలో 25 మిల్లీ మీటర్ల వర్షపాతం, కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 29 మిల్లీమీటర్ల నమోదయినట్లు అధికారులు తెలిపారు.