రుద్రంపూర్, జూలై 08 : పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 10వ రోజుకు చేరుకున్నాయి. కొత్తగూడెం ఏరియాకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “పీఆర్పీ వెంటనే చెల్లించాలి”, “పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి” అంటూ నినాదాలు చేశారు. అనంతరం సాయంత్రం అధికారులు మరోసారి సమావేశమై డిమాండ్ల సాధనకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగింపులో రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులకు డిప్యూటీ ఎస్ఈ ఉపేందర్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డీజీఎం (ఐఈడీ) యోహాను నిమ్మరసం అందించి నేటి దీక్షను విరమింపజేశారు. అధికారులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.