ఇల్లెందు, ఏప్రిల్ 29 : సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందస్తు అరెస్ట్‌ను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి తీవ్రంగా ఖండించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యదర్శి కళ్లేపల్లి మరియా, ప్రాజెక్ట్ నాయకురాళ్లు సరస్వతి, కె.అరుణ ఉన్నారు.