రామవరం మే 15 : తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు సంస్కారంతో పాటు మంచిని, మానవతా విలువలను నేర్పాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ముస్లిం స్త్రీ, పురుషుడు తప్పనిసరిగా జ్ఞానాన్ని ఆర్జించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారన్నారు. చదువు అంటే డిగ్రీ పట్టా, మార్కుల పత్రం కాదని, చదువు చక్కని సంస్కారం, ఉత్తమ నైతిక విలువలు కలిగిన మంచి మనిషిగా జీవించే మార్గం చూపాలన్నారు.
విద్యార్థులు ముఖ్యంగా తల్లిదండ్రులను, జ్ఞానాన్ని నేర్పే గురువులను గౌరవించడం నేర్చుకోవాలి చెప్పారు. పూర్వం గురుకులాల్లో ఉత్తమ కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత కలిగి జీవించడం నేర్పేవారని, నేడు విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందని, మంచి నడవడిక నేర్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఎస్.ఐ. ఓ వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి, విద్యార్థులకు నైతిక విలువలు బోధించడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో SIO జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, ముర్తజా పాల్గొన్నారు.