ఆళ్లపల్లి, ఆగస్టు 21 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధన కోసం ఈ నెల 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు తెలిపారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూ ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడంచల పోరాట కార్యక్రమంలో చివరిదైనా మహాధర్నా కార్యక్రమాన్ని ఈ నెల 23న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు, ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. పాలకులు మారినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పెద్ద మార్పేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోత్ భోజ్య, ఈసం ముత్తయ్య పాల్గొన్నారు.