కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 09 : రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్టాండ్ సెంటర్ లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాధావత్ శాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సమక్షంలో పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మండల పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. బాణాసంచా కాల్చి తమ నాయకుడు వద్దిరాజు రవిచంద్రపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం బాదావత్ శాంతి మాట్లాడుతూ.. అధినేత కేసీఆర్ మరోసారి పార్టీ విధేయతకు, కష్టపడి పనిచేసే నాయకత్వానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
ఎంపీ రవిచంద్ర అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్టత లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారన్నారు. పార్టీకి కష్ట కాలంలో ఢిల్లీలో పార్లమెంట్ లోపల, బయట బీఆర్ఎస్ గళాన్ని వినిపిస్తూ ధీటుగా నిలుస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీ రవిచంద్రకు మరిన్ని ఉన్నత పదవులు లభించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సంకు బాపన అనుదీప్, జిల్లా నాయకులకు బొమ్మిడి రమాకాంత్, పెయింటర్ రాజేష్, ముత్యాల రాజేష్, బొమ్మిడి శ్రీకాంత్, వేమునూరు శివ, జగడం కిరణ్, సర్పంచులు రతన్ నాయక్, బలరాం నాయక్, ముద్దంగుల మహేష్, రాజేష్, సచిన్, పూర్ణా నాయక్, కరాటే శ్రీనివాస్, టీబీజీకేస్ నాయకుడు కాజా పాషా, మిట్టపల్లి కిరణ్, గట్టు వేణుగోపాల్, విశాల్ కిరణ్, బొమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.