చుంచుపల్లి, మే 29 : తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఓ వడ్రంగి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలకు ప్రకారం.. గ్రామానికి చెందిన కళ్లకూరి వెంకట్రావు (62) వడ్రంగి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉంది.