రామవరం, ఏప్రిల్ 09 : బొగ్గు రవాణాలో దుమ్ము, ధూళి లేవకుండా చూసుకోవాలని డైరెక్టర్ (ఈ&ఎం) డి. సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం ఏరియాలోని జేవిఆర్ ఓసి, జేవిఆర్ సిహెచ్పిని బుధవారం ఆయన తనిఖీ చేసి, బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ వద్ద డంపర్స్ నుండి బొగ్గు అన్లోడింగ్ చేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి లేవకుండా బొగ్గు డంపర్స్ లో నింపుతున్నప్పుడే తడపాలని తద్వారా అన్లోడ్ సమయంలో దుమ్ము ధూళి లేవకుండా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రైమరీ కోల్ క్రషర్ ఏరియాను తనిఖీ చేశారు. జె.వి.ఆర్ సిహెచ్పి లోని డిశ్చార్జ్ పాయింట్లను, సైలో బంకర్ ను తనిఖీ చేసి అక్కడనుండి దుమ్ము ధూళి రాకుండా ఎలా అరికట్టాలో సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఆయన వెంట జిఎం(సివిల్) టి.సూర్యనారాయణ, జిఎం (సి.హెచ్.పి) తిరుమలరావు, ఎస్ ఓ టు డైరెక్టర్ (ఈ & ఎం) కె.వి. రావు, ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే.సూర్యనారాయణ రాజు, జెవిఆర్ సి.హెచ్.పి ఇన్చార్జి కె.సోమశేఖర్, జేవిఆర్ఓసి ప్రాజెక్ట్ ఇంజినీర్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ జే.వి.ఆర్. ఓసి రాజేశ్వరరావు, డీజీఎం(ఏరియా వర్క్ షాప్) టి. శ్రీకాంత్, డిజిఎం (ఫారెస్ట్) హరి నారాయణ, ఎస్ఈ (సి.హెచ్.పి) కార్పొరేట్ కేశవరావు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ యు.అభిలాష్, ఇతర అధికారులు ఉన్నారు.