హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకమైన 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ‘దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల, కేంద్ర సాయుధ బలగాల నుంచి ప్లేయర్లు హైదరాబాద్‌కు వస్తున్నారు.
ఇందుకోసం నగరంలోని ఆరు ప్రధాన మైదానాలు గచ్చిబౌలి స్టేడియం, హెచ్ఎఫ్సీ స్పోర్ట్స్ ఎరీనా, శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్, జాతీయ పోలీస్ అకాడమీ మైదానం, ఆర్టిలరీ సెంటర్ గ్రౌండ్, పోలీస్ అకాడమీ మైదానాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం. ఈనెల 25న గచ్చిబౌలిలో తెలంగాణ టీమ్ తలపడుతుంది’ అని అన్నారు. టోర్నీలో మొత్తం 37పురుష, 9 మహిళల జట్లు బరిలో ఉన్నాయని వివరించారు.