హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర కల్పించనున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమీక్షలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాలశాఖాధికారులు, ఆయా జిల్లాల సివిల్ సప్లయ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.