బహుజన చక్రవర్తి ‘సర్దార్ సర్వాయి పాపన్న’
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న యానిమేషన్ మూవీ ‘సర్దార్ సర్వాయి పాపన్న’. వెంకటేష్ గౌడ్ లింగంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి జీవీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. ఆర్కే ఫిల్మ్స్ ద్వారా ప్రముఖ నిర్మాత డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ఈ నెల 21న సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్నారు.
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న యానిమేషన్ మూవీ ‘సర్దార్ సర్వాయి పాపన్న’. వెంకటేష్ గౌడ్ లింగంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి జీవీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. ఆర్కే ఫిల్మ్స్ ద్వారా ప్రముఖ నిర్మాత డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ఈ నెల 21న సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని పాటను ఆదివారం విడుదల చేశారు. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఈ పాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘భూస్వాములు, పాలకులు, అధికారుల అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు గొప్ప పాలన అందించిన నాయకుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న.
బహుజన చక్రవర్తిగా కీర్తి గడించారాయన. అంతటి గొప్ప వ్యక్తి జీవితాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించే భాగ్యం కలగడం నిజంగా అదృష్టం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా ఈ సినిమాలోని కీలకమైన గీతం విడుదల కావడం ఆనందంగా ఉన్నది. ఆర్కే గౌడ్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం’ అని దర్శక,నిర్మాత వెంకటేష్ గౌడ్ అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, విజువల్ డైరెక్షన్: మిర్జాపురి సైమన్, వీఎఫ్ఎక్స్, సూపర్ విజన్: పి.శ్రీనివాస్, లీడ్ ఏఐ విజువల్ డైరెక్టర్: సురేష్ మల్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

