రామవరం, సెప్టెంబర్ 19 : సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం లాభాల వాటాను కార్మికులకు కేటాయించాలని అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా, ముట్టడి చేసి జీఎం శాలెం రాజుకి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు.
కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో కార్మికుల హక్కుల కోసం పోరాటం తప్పదని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సైతం పిలుపునిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, సత్తుపల్లి కార్యదర్శి సుధాకర్, ఆఫీస్ బెర్రర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హీరాలాల్, కుర్రు రమేశ్, పిట్ కార్యదర్శిలు మధుకృష్ణ, కిశోర్, నర్సింహారావు, సౌజన్య, భరణి, సీనియర్ నాయకులు సురేందర్, మురళి, క్రిస్టోఫర్, గుమ్మడి వీరయ్య, కోటి, రవి, కుమారకృష్ణ, భుక్య రమేశ్, బoడి వెంకటరమణ, కుమార్, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
Ramavaram : సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు పిలుపు : మిరియాల రంగయ్య