టేకులపల్లి, జనవరి 07 : బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకర్గ నాయకులు బుధవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఇల్లెందు నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, దిండిగాల రాజేందర్, భూక్య దళ్ సింగ్ నాయక్, డిసిసిబి మాజీ డైరెక్టర్, మాజీ జడ్పిటిసి లక్కినేని సురేందర్‌రావు ఉన్నారు.