ఇల్లెందు, ఏప్రిల్ 15 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో తరలి రావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మంగళవారం ఇల్లెందులో పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల చేశారు. అనంతరం 2వ నంబర్ బస్తీలో రజతోత్సవ సభ ప్రచార కార్యక్రమాన్ని గోడలపై రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ వద్దిరాజు, దిండిగాల రాజేందర్‌తో కలిసి రజతోత్సవ సభకు రావాలని పలు గృహాల్లోని మహిళలకు హరిప్రియ నాయక్ బొట్టు, గంధం పెట్టి ఆహ్వానించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సన్నహాక సమావేశంలో బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, వద్దిరాజు రవిచంద్ర, హరిప్రియ నాయక్ మాట్లాడారు.
Yellandu : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పండుగలా తరలాలి : ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నూటికి నూరు శాతం గెలుస్తుందన్నారు. అలిమి కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను, రైతులను గోసపెడుతుందన్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రజితోత్సవ సభతో గుండెల్లో గుబులు పుట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు హరిసింగ్ నాయక్, డిసిసి డైరెక్టర్ లక్కినేని సురేందర్‌రావు, బీఆర్ఎస్ భుక్య సంజీవ్ నాయక్, సిలివేరి సత్యనారాయణ, రంగనాథ్, వివిధ మండలాల అధ్యక్షులు శీలం రమేశ్, బొమ్మర్ల వరప్రసాద్, తాత గణేశ్, నాయకులు జేకే శ్రీను, బావ్‌సింగ్, వివిధ మండలాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Yellandu : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పండుగలా తరలాలి : ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ