దమ్మపేట, సెప్టెంబర్ 07 : అసెంబ్లీ లోపలికి పోనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నిరసనగా దమ్మపేట మండలంలోని మందలపల్లి నేషనల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్ కి తరిలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దొడ్డా రమేష్, మండల మాజీ ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, సర్పంచ్ కొమరం సుశీల, ఉప సర్పంచ్ రామకృష్ణ, సీనియర్ నాయకులు రావుల శ్రీనివాసరావు, అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్, రెడ్డిమాళ్ల నాగయ్య, యలమంచి చంద్రశేఖర్, శ్రీరాముల చక్రదరావు, నియోజకవర్గ మాజీ యూత్ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే, వార్డు సభ్యులు గొల్ల భవానికృష్ణ, రూప రాంబాబు, ఊయ్యాల లక్ష్మీనారాయణ, నాగరాజు, కాసిని శ్రీను, ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, కొలికపోగు ధర్మ, బండి ప్రసాద్, తోగర్త సురేష్, తోగర్త వెంకటేశ్వరావు, తోలేం మల్లేశ్వరావు, పాశ్యం ప్రసాద్, బిసి నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు, పాకనాటి శ్రీను, సున్నం నరేందర్, దండబత్తుల కాంతారావు, బండి ప్రసాద్ పాల్గొన్నారు.