లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 25 : రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని కోరుతూ బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. యూరియా సరఫరా చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పవని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు సంఘం నాయకుడు, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, బట్టు కనకరాజు, బానోత్ శ్రీకాంత్ నాయక్, చిర్రా వెంకన్న, తరాల మహేశ్, లావుడియా వెంకటేశ్, బద్రు, బానోత్ రవి, పొగాకు వెంకటేశ్వర్లు, మాలోత్ రాజు, కొంపల్లి వెంకన్న, పరిపూర్ణ చారి, తరాల దాము, జక్కుల శీను, మాలోతు రాజు, లాల్ తండ శీను, మాజీ సర్పంచులు కోరెం చంద్రశేఖర్, తాడూరి రజాక్, మాజీ వార్డు సభ్యులు పొదిలి వెంకటాచలం, కోట రాంబాబు, గోనె సురేశ్, తంబళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.