ఇల్లెందు అక్టోబర్ 9 : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఛలో బస్ భవన్ ముట్టడికి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ ముందు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తున్నదని విమర్శించారు.
పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్. రంగనాథ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జేకే శ్రీను, మాజీ కౌన్సిలర్లు సిలివేరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు, జబ్బార్ మహ్మద్, ఎలమందల వాసు, రామ్‌లాల్ పాసి, లలిత్ కుమార్ పాసి, డేరంగుల పోశం, రాజేష్, కిషన్ పాసి, వార రమేష్, రాచపల్లి శ్రీను, సతీష్ తదితరులు ఉన్నారు.