– రూ.34 వేలు నగదు, బియ్యం, నిత్యావసర సరుకుల అందజేత
బీబీనగర్, ఫిబ్రవరి 14 : బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కొవ్వాకుల వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న జడ్పీహెచ్ఎస్ బీబీనగర్ 1999-2000 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. స్నేహితుడి కుటుంబానికి చేయూతనివ్వాలని నిర్ణయించి రూ.34 వేల నగదు సేకరించి అందజేశారు. అదే విధంగా 125 కిలోల బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాధవి, కాసుల రఘునందన్ గౌడ్, సామల వేణు, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొలను శ్రీనివాస్ రెడ్డి, తుపెళ్లి మహేందర్ రెడ్డి, పొద్దుటూరి నవీన్, బండ నరేందర్, అల్వాల కాటమయ్య, ఆవుల కృష్ణ, దవాడి శ్రీశైలం, పొట్ట సుధాకర్, రాగిరి మునిరాజు, గోరుకంటి మోహన్, ఊట్ల సాయిబాబా, ఎండీ.యాకుబ్ పాల్గొన్నారు.