Salman Agha: ఇండియన్ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్ ఇస్తారా?.. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఏమన్నారంటే
Salman Agha: పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘా మీడియాతో మాట్లాడారు. షేక్‌హ్యాండ్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. భారత్‌తో కరచాలనం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని అడగ్గా.. రేపు ఏం జరుగుతుందో చూద్దామని కెప్టెన్ సల్మాన్ ఆఘా అన్నారు.
కొలంబో: టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ సిద్దమైంది. కొలంబో స్టేడియంలో ఇవాళ ప్రాక్టీస్ చేసింది. ఇక మీడియాతో ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘా(Salman Agha) మాట్లాడారు. షేక్‌హ్యాండ్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. భారత్‌తో కరచాలనం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని అడగ్గా.. రేపు ఏం జరుగుతుందో చూద్దామని కెప్టెన్ సల్మాన్ ఆఘా అన్నారు. ఆసియాకప్‌లో ఇరు జట్ల కెప్టెన్లు, ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోని విషయం తెలిసిందే. భారత్, పాక్ పోరుపై జరుగుతున్న చర్చ, క్రీడాస్పూర్తి గురించి కామెంట్ చేయాలని కోరగా.. సల్మాన్ ఆఘా స్పందిస్తూ.. ఓ మంచి ఉద్దేశంతో ఆటను ఆడాలని, నేను ఏం ఆలోచిస్తున్నానో అది ముఖ్యం కాదు అని, ఎలాగైతే క్రికెట్ మొదలైందో, అలాంటి ఆటనే ఆడాలని అన్నారు.
ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి కూడా సల్మాన్ ఆఘా కామెంట్ చేశారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడుతాడని ఆశిస్తున్నామని, బహుశా అతను కోలుకుంటున్నాడని భావిస్తున్నామని, కానీ ఉత్తమమైన జట్టుతోనే తాము తలపడాలని అనుకుంటున్నట్లు సల్మాన్ తెలిపారు. వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్‌కు మంచి రికార్డు లేదని అంగీకరించారు. చరిత్రను మార్చలేమని, కానీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. బౌలర్ ఉస్మాన్ తారీఖ్ యాక్షన్ వివాదం గురించి స్పందిస్తూ… ఉస్మాన్‌కు ఐసీసీ రెండు సార్లు క్లియరెన్స్ ఇచ్చిందని, ఎందుకు అంతగా అతని యాక్షన్ గురించి చర్చిస్తున్నారో అర్థంకావడం లేదని, అతనేమీ దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. అతను మా ట్రంప్‌కార్డ్ అవుతారన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

