నల్లగొండ సిటీ, ఆగస్టు 11 : తెలంగాణా 1104 యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా విద్యుత్ సర్కిల్ ఆఫీస్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 2008 నుండి 2014 సర్కిల్ యూనిట్ కార్యదర్శిగా, 2014 నుండి 2016 వరకు నల్లగొండ డివిజన్ ఆధ్యక్షుడిగా, 2016 నుండి 2018 వరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, 2018 నుండి నేటి వరకు నల్లగొండ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి, కంపెనీ కమిటీకి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.