చండ్రుగొండ/ఆత్మకూరు, మార్చి 15: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, ఆత్మకూరు మండలాల్లో పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చండ్రుగొండ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శాసన సభను కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లా మారుస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను సస్పెన్షన్ ద్వారా నొక్కాలని చూడటం అవివేకమని మండిపడ్డారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొనకండ్ల వెంకటరెడ్డి, దారా బాబు, సగొండి రాఘవులు, నరుకుల సత్యనారాయణ, భూపతి రమేష్, సూరా వెంకటేశ్వరరావు, మేడ మోహన్‌రావు, సత్తి నాగేశ్వరరావు, పాండ్ల అంజన్న రావు, భూపతి శ్రీనివాసరావు, కల్ల వెంకటేశ్వర్లు, సయ్యద్ గఫార్‌మియా, సయ్యద్ బాద్షా, రామరాజు హనుమంతరావు, శ్రవణ్, యాకోబు, ఆకుల లక్ష్మీనారాయణ, పసుపులేటి క్రాంతి కుమార్, తదితరు పాల్గొన్నారు.
ఆత్మకూరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డిపై నిషేధం ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌ను అవమానించేలా ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ మీద గౌరవం ఉదని చెప్పారు. కావాలనే సీఎం రేవంత్ రెడ్డి సస్పెండ్ చేపించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, మండల నాయకులు అయినాల రామకృష్ణ, కాపుల సూరిబాబు, తూతీక ప్రకాష్, అంబటికర్ర కృష్ణ, నానిపల్లి శ్రీను, బాసిపోయిన మోహన్ రావు, రావూరి రవికిరణ్, బద్ది బాబి, ఇమంది నాగేశ్వరరావు, మురాలడానియల్ ప్రదీప్, కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, తెల్లం రాణి, గంపల రవి కుమారి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.