జూలూరుపాడు, ఏప్రిల్ 27 : జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో సోమవారం జరిగాయి. మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గులాబీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పార్టీని స్థాపించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపిన తీరును కొనియాడారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల రక్షణలో కేసీఆర్ ఎప్పటికీ ‘శ్రీరామరక్ష’ అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు యదళపల్లి వీరభద్రం, మాజీ సొసైటీ డైరెక్టర్ భూక్యా జోహార్ లాల్, గుండెపూడి ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు, బుడిపూడి ప్రభాకర్, ఇల్లంగి తిరుపతి, పోతురాజు రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బండారి వెంకయ్య, బుడిపూడి ప్రతాప్, పోతురాజు కృష్ణ, ఈసాల వెంకటేష్, ముకేష్, చందు తదితర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.