హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి సస్యశ్యామల తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా జలసంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నదని సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.