హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ కలిగిన ప్రయాణికులు తమ అదనపు లగేజీని ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నది. ఈవిధానం జూలై 31 నుంచి అందుబాటులోకి రానుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఐఆర్సీటీసీ పోర్టల్లో లగేజీ బుకింగ్ చేసుకోవచ్చు.