ఆళ్లపల్లి ఏప్రిల్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. మర్కోడ్ బొడ్రాయి సెంటర్ వద్ద మాజీ జడ్పిటిసి కొమరం హనుమంతరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన పార్టీగా, రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, మాజీ పీఏసీఎస్చైర్మన్ గొగ్గేల రామయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి రాంబాబు, వార్డు మెంబర్ వెంకట కృష్ణంరాజు, కొమరం సతీష్, నాయకులు ముసలయ్య ,నరేష్ సమ్మయ్య, కోటేష్, అంజయ్య, కనకాచారి, సతీష్ , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు