చుంచుపల్లి, మే 14 : చుంచుపల్లి మండల ప్రజా పరిషత్ 2023-2024 సంవత్సరానికి గాను ఎంపీపీ నిధుల ద్వారా పీఎఫ్ఎంఎస్ పద్ధతిలో మంజూరైన బోర్వెల్ (మోటార్‌తో సహా) ఎన్ కె నగర్ పంచాయతీ పరిధిలోని చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడేలా బోర్వెల్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్కే నగర్ బాదావత్ తండా సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్, ఏఈ వసంత, ఉప సర్పంచ్ లక్ష్మి, సెక్రటరీ ఇందిర, పాలకవర్గ సభ్యులు జాన సుజాత, అరుణ, క్రాంతి, లక్ష్మి పాల్గొన్నారు.