రామవరం, సెప్టెంబర్ 17 : సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ ను సంప్రదించగా వెంటనే ట్రస్ట్ సభ్యుడు నారదాసు శ్రీకాంత్ (చోటు భాయ్) రక్తదానం చేసి ఆదుకున్నాడు. ఈ సందర్భంగా ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వస్తే రక్త దాత తప్పా మరో ప్రత్యామ్నాయం లేదని అందుకే రక్తదానం మహాదానం అన్నారు. ట్రస్ట్ సభ్యుడు చోటు రక్తదానం చేయడం ఇది 21వ సారి అని ప్రాణధార ట్రస్ట్ నిర్వాహకుడు జిమ్ సంతోష్ అభినందించాడు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు రక్తదానం చేసి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.