ఇల్లందు ఏప్రిల్ 24: భారత రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ఇల్లెందు నియోజకవర్గ నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, ఎస్. రంగనాథ్, పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేష్, కంభంపాటి రేణుక, అజ్మీర భావ్ సింగ్, కాసాని హరిప్రసాద్, గిన్నారపు రాజేష్, బజారు సత్యనారాయణ, డేరంగుల పోశం, లక్ష్మీనారాయణ, గిన్నారపు మహేందర్, తోట లలిత శారద, సరిత తదితరులు పాల్గొన్నారు.