కొత్తగూడెం అర్బన్, మే 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమాఖ్య నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునిత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి జిల్లా డి.ఆర్.డి.ఓ. విద్య చందన హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. జిల్లా బ్యాంక్ లింకేజీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఎన్పీఏను కూడా తగ్గించటం జరిగిందన్నారు. ఈ విషయమై మంత్రి సీతక్క, సెర్ప్ సి.ఈ.ఓ. సైతం అవార్డు అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వం, సెర్ప్ ఇస్తున్న రుణాలను మహిళా గ్రూప్ సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఎం.ఐ.బి.సెర్ప్ వసంత సేనా, అదనపు డి.ఆర్.డి.ఓ, డి.పి.ఎం.లు , మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.