భద్రాచలం- సారపాక : నూతన బ్రిడ్జి వద్ద కుంగిన అప్రోచ్ రోడ్
భద్రాచలం- సారపాక మధ్య గోదావరి నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన (కొత్త) వారధి వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. సారపాక వద్ద కొత్త వంతెనకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోవడంతో..
– రాత్రి నుండి నిలిచిన రాకపోకలు
– పాత బ్రిడ్జిపై మీదుగా వాహనాల మళ్లింపు
– నిర్మాణ లోపమా, సాంకేతిక వైఫల్యమా?
బూర్గంపహాడ్, మే 08 : భద్రాచలం- సారపాక మధ్య గోదావరి నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన (కొత్త) వారధి వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. సారపాక వద్ద కొత్త వంతెనకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమై కొత్త వారధిపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మట్టి పక్కకు జారిపోవడాన్ని గమనించిన ప్రయాణీకులు భయాందోళనకు గురై రోడ్డు కుంగిన సమాచారం అధికారులకు తెలపడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రమాద తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తతో వాహనాల రాకపోకలను కొత్త వారధిపై నిలిపివేసి పాత వంతెన మీదుగా మళ్లించారు. అయితే పాత బ్రిడ్జి కావడంతో పాటు పెద్ద పెద్ద వాహనాలు సైతం పాత వారధి మీదుగా వెళ్తుండడంతో ప్రయాణీకులు, వాహనదారులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
నిర్మాణ లోపమా ?
కొత్త వారధి వద్ద అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో సంబంధిత శాఖ అధికారులు నిర్మాణ లోపాలపై దృష్టి సారించారు. అయితే బ్రిడ్జి కింద అప్రోచ్ కొట్టుకుపోవడానికి ఏమైనా సాంకేతిక కారణాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణీకులు, వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వాహన రాకపోకలను ఈ వంతెనపై నిలిపివేసినప్పటికీ ఎన్నో కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కొద్దికాలానికే ఇలా అప్రోచ్ కొట్టుకుపోవడం పట్ల పలువురు నేషనల్ హైవే అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.
అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిన సమయంలో అధికారులు అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే ఎడమవైపు అప్రోచ్ రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా కుడి వైపున అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంపై పలువురు వాహనదారులు నూతన వారధి నిర్మాణ పనులపై మండిపడుతున్నారు. ఈ విషయమై నేషనల్ హైవే డీఈ శైలజను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.

భద్రాచలం- సారపాక : నూతన బ్రిడ్జి వద్ద కుంగిన అప్రోచ్ రోడ్
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

